చిత్రం: పలనాటి పౌరుషం (1994) తారాగణం: కృష్ణంరాజు, చరణ్ రాజ్, రాధిక, సంజయ్ భార్గవ్, సురభి
సంగీత దర్శకులు: ఏ.ఆర్.రెహమాన్ సినీ దర్శకులు: ముత్యాల సుబ్బయ్య
గానం: మనో(నాగూర్ బాబు), సుజాత
పల్లవి: మేనత్త కూతురివే మెరుపంటి మరదలివే
మదిలోన మరులోలికే మరుమల్లె జాతరవే
పొట్టి జళ్ళ పాలపిట్ట పైటకొచ్చేనెప్పుడoట
చిన్ని చిన్ని చంద్రవంక పున్నమేప్పుడయ్యేనంట
నీ మాట మూగాబోతే నా మనసు ఆగేదెట్టా......
రాగల సిలకా రంగేళి మొలక...
రాయంచ నడకా రావేకు తళుకా......................(2)
చరణం 1: ఎదలోన ఎలుగు నీడలా
ఎదుట ఎవరు ఇది ఎంకి పాటలా
జాలు వారుతున్న జాబిలింటి జాణతనమా
జారు పైట వేసుకున్న జానపదమా.....
రాగాలెవో నీలో నాలో వినిపించే... అనురాగాలేగా నిన్ను నన్ను కనిపెంచే....
రాగల సిలకా రంగేళి మొలక...
రాయంచ నడకా రావేకు తళుకా..
ఏ.....ఏ.....ఏలో...ఏలో....ఏలో..ఏలేలో.....ఏలోలో...
చరణం 2: కంటికి కునుకే రాదాయే నోటికి మెతుకే చేదాయె
ఒంటిలో తాపం ఏదో మొదలాయె
ఎక్కడో కాకులు కూస్తున్న ఎవ్వరో తలుపులు తీస్తున్నా
నువ్వానే వెతికే గుండెకు గుబులాయె
నావ కడ గట్టిగ అరిసాను...బావ సడి గుట్టుగ అడిగాను
గాలితో కబురులు పంపాను....మబ్బుతో మనసును తెలిపాను
దేనికి బదులేరాక కుదురేలేక కన్నీరోలికాను....
ముద్దుల బావ నన్నిక ఇడిసి పోవద్దు
ఈ మరదలి ప్రాణం నీ పై ఉందని మరవద్దు...
రాగల సిలకా రంగేళి మొలక...
రాయంచ నడకా రావేకు తళుకా......

No comments:
Post a Comment