About Me

My photo
పలు విషయముల పట్ల కలగిన ఆసక్తిని ఉపయోగకరంగా చేసి వినియోగిస్తుంటాను(ఆధ్యాత్మిక, దైవిక, సాంకేతిక, సాంఘిక, సాహిత్యం..etc.,)

Thursday, February 17, 2011

స్వాతిముత్యం (1985)

చిత్రం: స్వాతిముత్యం (1985)                                       తారాగణం: కమలహాసన్, రాధిక
సంగీత దర్శకులు: ఇళయరాజా                                     సినీ దర్శకులు: కే. విశ్వనాధ్
గానం: ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, ఎస్.జానకి                    రచన: ఆత్రేయ

     రామ కనవేమిరా...రామ కనవేమిరా...శ్రీ రఘురామ కనవేమిరా...ఆ ఆ ఆ ఆ.....
     రామ కనవేమిరా...రమణీ లలామ, నవ లావణ్య సీమ, ధరాపుత్రి, సుమగాత్రి, 
     నడయాడి రాగా.....రామ కనవేమిరా.......
     
     సీతా స్వయవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించిన జానకిని సభాసభులందరూ 
     పదే పదే చూడగా శ్రీ రామ చంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ 
     అనుంగు చెలికత్తెలు..... 
     
     రామ కనవేమిరా...రామ కనవేమిరా...శ్రీ రఘురామ కనవేమిరా...ఆ ఆ ఆ ఆ.....
     రామ కనవేమిరా...రమణీ లలామ, నవ లావణ్య సీమ, ధరాపుత్రి, సుమగాత్రి, నడయాడి రాగా......
     రామ కనవేమిరా.......
     
     ముసి ముసి నగవుల రసిక శిఖామణులు............సానిదమ పమగరిస
     ఒస పరి చూపుల అసదుశ విక్రములు.................సగ రిగ మని దమ నిని  
     ముసి ముసి నగవుల రసిక శిఖామణులు............తా తకిట తకజనుత 
     ఒస పరి చూపుల అసదుశ విక్రములు.................తకజను తకధిమి తక
     మీసం మీటే రోష పరాయణులు...........................నిదమ పమ గరిగ
     మాసరి ఎవరను మత్తగులోన్వనులు........ఆహా....క్షణమే....ఒక దినమై....నిరీక్షణమే మరు యుగమై 
     తరుణి వంక శివ ధనువు వంక తమ తనువు మరిచి కనులు తెరిచి చూడగ రామ కనవేమిరా కనవేమిరా....l
     
     ముందుకేగి విల్లందబోయి ముచ్చెమటలు పట్టిన దొరలు.....భూవరులు
     తొడగొట్టి ధనువు చేబట్టి బావురని గుండెలు జారిన విభులు............(...2)
     ఆ గుండెలు జారిన విభులు...........
     
      విల్లెత్తాలేక మొగమెత్తాలేక సిగ్గేసిన నరపుంగవులు..................
     తమ ఒళ్ళు ఒరిగి రెండు కళ్ళూ తిరిగి ఒగ్గేసిన పురుషాగ్రణులు....ఎత్తేవారు లేరా విల్లు ఎక్కు పెట్టే వారు లేరా...
     ఎత్తేవారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా........అరె అరె(..2)
     ఆహా ఎత్తేవారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా........కడకు తయ్యకుతా ధిమితా.....
                          రామయ  రామభద్రాయ రామచంద్రయ నమః    
     అంతలో రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు........(2)
     సీతా వంక ఓర కంట చూసినాడు................(2)
     ఒక్క చిటికెలో విల్లు ఎక్కుపెట్టినాడు......చిటికెలో విల్లు ఎక్కుపెట్టినాడు....
     పెళ పెళ పెళ పెళ ....(2)......పెళ పెళ విరిగెను శివ ధనువు హోయలోలికేను సీతా నవ వధువు....

     జయ జయ రామ రఘుకుల సోమ...దశరధ రామ దైత్యభిరామ    
     జయ జయ రామ దశరధ రామ.....
     సీతా కళ్యాణ వైభోగమే శ్రీ రామ కళ్యాణ వైభోగమే...........(2)
     కనగ కనగ కమనీయమే అనగ అనగ రామనీయమే......(2)  
     సీతా కళ్యాణ వైభోగమే 
     శ్రీ రామ కళ్యాణ వైభోగమే.....
     రామయ్యా! అదుగోనయ్యా...
     రమణీ లలామ, 
     నవ లావణ్య సీమ, 
     ధరాపుత్రి,
     సుమగాత్రి,
     నడయాడి రాగా........
     రామ కనవేమిరా...
     శ్రీ రఘురామ కనవేమిరా.....
     శ్రీ రఘురామ కనవేమిరా...... 

                                       ఏతత్ రామర్పణం 

No comments:

Post a Comment