చిత్రం: ఆరెంజ్ (2010) తారాగణం: రామ్ చరణ్ తేజ్, జెనిలియా
సంగీత దర్శకులు: హారిస్ జయరాజ్ సినీ దర్శకులు: భాస్కర్
గానం: జి.వి.ప్రకాష్ రచన: రామ జోగయ్య శాస్త్రి
పల్లవి: హలో రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ
పో పో పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా II హలో రమ్మంటే II
ఎలా ఏ రోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ
నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా
నా మనసిది..........ఓ ప్రేమ నది
నా గుండె తడి........నీ పై వెల్లువై పొంగినది II హలో రమ్మంటే II
చరణం 1: 24 క్యారట్ లవ్ లీ ప్రేమ
24x7 నీపై కురిపిస్తున్నా
ఎంత నువ్వు నన్ను తిట్టుకున్నా
ఎవ్రీ సెకన్ నీకై పడిచస్తున్నా
ఏడు రంగులుగ సులువుగ విడివడిపోని
తెల్ల తెల్లనైన మనసిదీ
ఎన్నో కళలుగ విరిసిన పూవుల ఋతువై నీ కొరకే చుస్తున్నదీ
నువ్వంటే ఇష్టమంటుంది సరేలెమ్మంటూ బదులిస్తే తప్పేముంది II హలో రమ్మంటే II
చరణం 2: అందమైన కలలు చూస్తూవున్నా
అందులోన నేను నీతో ఉన్నా
అంతు పోల్చలేని ఆనందాన
ఈ క్షణాన్ని నీకే సొంతం అన్నా
ఇది మనసుకు మాత్రమే తెలిసే ఫీలింగ్ కావాలంటే చదువుకో మనసుతో
గంగాలాంటి నా ప్రేమ ఇది జీవనది డార్లింగ్ చేతులారా గుండెను నింపుకో
చెలీ నువ్వెంత వద్దన్నా ప్రేమగా పెరిగిపోతున్నాప్రేమలోనా II హలో రమ్మంటే II
