చిత్రం: ప్రేమ (1988) తారాగణం: వెంకటేశ్, రేవతి
సంగీత దర్శకులు: ఇళయరాజా సినీ దర్శకులు: సురేష్ కృష్ణ
గానం: ఎస్.పి.బాలు, చిత్ర రచన: ఆచార్య ఆత్రేయ
పల్లవి: ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు II ఇవ్వు ఇవ్వు II
వద్దు వద్దు అంటూ పోతే చిన్నదానా
ఎప్పుడంట ఇచ్చేదంటా
కన్నె ముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడా
పెళ్లిదాకా ఆగవంటా
కళ్ళతోటి పెళ్లయింది చాల్లే II ఇవ్వు ఇవ్వు II
చరణం 1: ఆద్యంతమూ లేని అమరానందమే ప్రేమ
ఏ బంధమూ లేని తోలి సంబంధమే ప్రేమ
ప్రేమ దివ్యభావము
ప్రేమ దైవరూపము
ప్రేమ జీవరాగము
ప్రేమ జ్ఞానయోగము
మనసున పారే సెలయేరు ప్రేమ
అలసట తీర్చే చిరుగాలి ప్రేమ
హద్దులేవి లేనిది అందమైన ప్రేమ II ఇవ్వు ఇవ్వు II
చరణం 2: ఓ అల్లరి ప్రేమ ఇక ఆడించకు నన్ను
ఓ టక్కరి ప్రేమ ఇక లాలించకు నన్ను
నీకు నేను సొంతము
నాకు నీవు సర్వము
నీవు నాకు దేహము
నేను నీకు ప్రాణము
ప్రతిరోజూ నీ ఉదయాన్ని నేను
ప్రతిరేయి నీ నెలవంక నేను
జన్మలెన్ని మారిన ప్రేమ పేరు ప్రేమే II ఇవ్వు ఇవ్వు II

No comments:
Post a Comment