About Me

My photo
పలు విషయముల పట్ల కలగిన ఆసక్తిని ఉపయోగకరంగా చేసి వినియోగిస్తుంటాను(ఆధ్యాత్మిక, దైవిక, సాంకేతిక, సాంఘిక, సాహిత్యం..etc.,)

Sunday, September 29, 2019

అల వైకుంఠపురంలో
 *సామజవరగమనా*
సాహిత్యం: సిరివెన్నల సీతారామశాస్త్రి గారు
సంగీతం: తమన్
గాయకులు: సిద్ శ్రీరామ్

నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు

నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు

నీ కళ్ళకి కావాలి కాస్తా ఏ కాటుకలా నా కలలు
నువ్వు ములుముతుంటే ఎర్రగా కంది చిందేనే సెగలు

నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతు ఉంటే ముంగురులు
నువ్వు నెట్టేస్తె ఎలా నిట్టూర్చవట్టే నిష్ఠూరపు విలవిలలు

సామజవరగమనా
నిను చూసి ఆగగలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా

సామజవరగమనా
నిను చూసి ఆగగలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా

నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు

మల్లెల మాసమా
మంజుల హాసమా
ప్రతి మలపులోన ఎదురుపడిన వెన్నెల వనమా

విరిసిన పింఛమా
విరుల ప్రపంచమా
ఎన్నెన్ని వన్నె చిన్నెలంటె
ఎన్నెల వశమా

అరె, నా గాలె తగిలినా
నా నీడె తరిమినా
ఉలకవా, పలకవా, భామా...

ఎంత బ్రతిమాలినా
ఇంతేనా అంగనా
మదిని మీటు మధురమైన మనవిని వినుమా

.... వరం 🖊