చిత్రం: అడవి రాముడు (28-04-1977) తారాగణం: ఎన్.టి.రామరావు,జయప్రద & జయసుధ
సంగీత దర్శకులు: కే.వి.మహదేవన్ సినీ దర్శకులు: కే. రాఘవేంద్ర రావు
మనిషి పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ..........
పట్టుదలే ఉంటె కాగలదు మరో బ్రహ్మ........
పల్లవి: కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు
మహా పురుషులౌతారు
తరతరాలకి తరగని వెలుగౌతారు
ఇలవేలుపులౌతారు...
చరణం 1: అడుగో అతడే వాల్మీకి
బ్రతుకు వేట అతనికి
అతిభయంకరుడు యమకింకరుడు
అడవి జంతువులపాలిటి అడుగో
అతడే వాల్మీకి
పాలపిట్టల జంట వలపు తేనెల పంట
పండించుకుని పరవశించి పోయేవేల
ఆ పక్షులు జంటకు గురి పెట్టాడు
ఒక పక్షిని నేల కూల్చాడు
జంట బాసిన పక్షి కంట పొంగిన గంగ
తన కంటిలో పొంగ మనసు కరగంగ
ఆ శోకంలో ఒక శ్లోకం పలికే
ఆ చీకటి ఎదలో దీపం వెలిగే
కరకు బోయడే అంతరించగా
కవిగా అతడు అవతరించగా
మనిషి అతనిలో మేల్కొన్నాడు
కడకు మహర్షే అయినాడు
నవరసభరితం రాముని చరితం
జగతికి అతడు పంచిన అమృతం
ఆ వాల్మీకి మీవాడు మీలోనే ఉన్నాడు
అక్షరమై మీ మనసు వెలిగితే
మీలోనే ఉంటాడు
అందుకే II కృషి ఉంటే II
చరణం 2: ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం
తిరుగులేని దీక్షకి అతడే ప్రాణం
కులం తక్కువని విద్యనేర్పని
గురువు బొమ్మగా మేగిలాడు
బొమ్మ గురువుగా చేసుకొని
బాణ విద్యలో పెరిగాడు
హుటాహుటిని ద్రోణుడపుడు
తటాలుమని తరలివచ్చి
పక్షపాత బుద్ధితో దక్షిణ ఇమ్మన్నాడు
ఎదుట నిలిచిన గురుని పదమంటి
ఏమివ్వగలవాడననే ఏకలవ్యుడు
బొటనవ్రేలివ్వమనే కపటి ఆ ద్రోణుడు
వల్లెయనే శిష్యుడు చెల్లె
ద్రోణుని ముడుపు
ఎరుకలవాడు అయితేనేమి
గురికల వాడే మొనగాడు
వేలునిచ్చి తన విల్లును విడిచి
వేలుపుగా ఇలా వెలిగాడు
అందుకే II కృషి ఉంటే II
చరణం 3: శబరీ.......ఇంతకాలము వేచినది
ఈ పిలుపుకే శబరి
ఆశ కరువిడి అడుగు తడబడి
రామపాదము కన్నది
వంగిపోయిన నడుముతో
నగుమోము చూడగలేక అపుడు
కనులు నీరిడి ఆ రామపాదము
కడిగినది శబరి
పదముల ఒరిగినది శబరి
ప్రేమ మీరగ రాముడప్పుడు
శబరి తల్లి కనులు తుడిచి
కోరి కోరి శబరి కోరికిన
దొర పండ్లను ఆరగించే
ఆమె ఎంగిలి గంగ కన్నా
మిన్నగా భావించిన
రఘురాముదెంతటి ధన్యుడో
ఆ శబరిదెంతటి పుణ్యమో
ఆమె ఎవ్వరో కాదు సుమా
ఆడబడుచు మీ జాతికి
జాతిరత్నములు ఎందరెందరో
మీలో కలరీ నాటికీ
అడివిని పుట్టి పెరిగిన కథలే
అఖిల భారతికి హారతులు
నాగరికతలో సాగు చరితలో
మీరే మాకు సారధులు
అందుకే II కృషి ఉంటే II

