చిత్రం: మనసు పలికే మౌన రాగం (2006) తారాగణం: స్నేహ & విక్రమ్ ఆదిత్య
సంగీత దర్శకులు: కే.ఎమ్.రాధా కృష్ణన్ సినీ దర్శకులు: నాగాభూషణ్
గానం: చిత్ర రచన: వేటూరి
పల్లవి: రామ సీత అంటే ప్రేమ ప్రేమ..........
రాధా కృష్ణ జంటే ప్రేమ ప్రేమ.............
మనసే మనసై ఎదిగే ప్రేమ
తనదై తనకై వెలిగే ప్రేమ
ప్రేమే కాదా మధు మహిమ
రామ సీత అంటే ప్రేమ ప్రేమ..........
రాధా కృష్ణ జంటే ప్రేమ ప్రేమ......
చరణం 1: నీలాల మేఘం సూరీడి ప్రేమ
కార్తిక మాసం జాబిల్లి ప్రేమ...........
నీలాల మేఘం సూరీడి ప్రేమ
కార్తిక మాసం జాబిల్లి ప్రేమ...........
వానై వరదై కలిగే ప్రేమ
పెదవై మురళి కలిపే ప్రేమ
మధుర యమునా పిలుపే ప్రేమ
మధుర యమునా పిలుపే ప్రేమ......
ప్రేమే నీకు బ్రతుకు సుమ........
రామ సీత అంటే ప్రేమ ప్రేమ..........
రాధా కృష్ణ జంటే ప్రేమ ప్రేమ......
చరణం 2: కొమ్మల్లో రాగం సన్నాయి ప్రేమ
కోవెల్లో దీపం అమ్మాయి ప్రేమ
కొమ్మల్లో రాగం సన్నాయి ప్రేమ........
కోవెల్లో దీపం అమ్మాయి ప్రేమ........
పూవై తావై విరిసే ప్రేమ
ఇస్తే రానీ మనసే ప్రేమ
చస్తే అర్ధం కాదే ప్రేమ
చస్తే అర్ధం కాదే ప్రేమ.......
ప్రేమే లేని బ్రతుకు శ్రమా ...................
రామ సీత అంటే ప్రేమ ప్రేమ..........
రాధా కృష్ణ జంటే ప్రేమ ప్రేమ.............
మనసే మనసై ఎదిగే ప్రేమ
తనదై తనకై వెలిగే ప్రేమ
ప్రేమ కాదా మధు మహిమ
రామ సీత అంటే ప్రేమ ప్రేమ..........
రాధా కృష్ణ జంటే ప్రేమ ప్రేమ.....

No comments:
Post a Comment