చిత్రం: ఆవారా (2010) తారాగణం: కార్తి, తమన్నా
సంగీత దర్శకులు: యువన్ శంకర్ రాజా సినీ దర్శకులు: త్రివిక్రమ్ శ్రీనివాస్ గానం: రాహుల్ నంబియార్, సైంధవి రచన: వెన్నెలకంటి
పల్లవి:
అరెరే వాన జడివాన
అందాల నవ్వులే పూల వాన II అరెరే II
మళ్లీమళ్లీ వానొస్తే మనసు గొడుగు చెలి పడితే
గారం పెరిగింది దూరం తరిగింది
ఏమైంది ఏమైంది ఏదేదో జరిగింది
నెమలి కన్నులాగ చెలి నాట్యమాడుతుంటే
ఎదే పాలపుంతై నా మనసు నాడమంది
ఏమైంది ఏమైంది ఏదేదో జరిగింది II అరెరే II
చరణం 1: ఆటా పాటా ఓ పాడని పాట
వానే పాడింది అరుదైన పాట
నిన్ను నన్ను కలిపిన
ఈ వానకొక్క సలామ్ కొట్టు
నేను తప్పిపోయాను
నీలోన వెతికి పెట్టు
మంత్రంలాగ ఉంది
ఇది తంత్రంలాగా ఉంది
చిత్రంగానే మదిలో ఒక యుద్ధం జరుగుతోంది
దేవత ఏది నా దేవత ఏది
తను సంతోషంగా ఆడుతూ ఉంది
చరణం 2: నిన్ను మించి వెరెవరూ లేరే
నన్ను మించి నేకవరూ లేరే
చిన్న చిన్న కళ్ళు రెండు
దేవుడు నాకు ఇచ్చాడంట
కళ్ళు రెండు మూసుకున్న
నీవున్నదె మాయమట
మల్లెపూల పొద్దు
నాకు ఇచ్చి పోవే ముద్దు
ముద్దుచాటు సద్దు
చెరిపేయమంది హద్దు
పులకించింది ఎద పులకించింది
చెలి అందాలనే చిలికించింది II అరెరే II

No comments:
Post a Comment