చిత్రం: దశావతారం (13-06-2008) తారాగణం: కమల్ హసన్ & అసిన్ తొట్టుంకల్
సంగీత దర్శకులు: హిమేష్ రేష్మియా సినీ దర్శకులు: కే.ఎస్. రవి కుమార్
గానం: హరి హరన్ రచన: వెన్నెలకంటి
పల్లవి: ఓం... నమో నారాయణాయ.........
రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు
దేవుని మాత్రం కంటే దేహం కనరాదు....
[రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు
దేవుని మాత్రం కంటే దేహం కనరాదు....]
హరిని తలుచు నా హృదయం
నేడు హరుని తలుచుట జరుగాదులే
అష్ట అక్షరం తెలిసిన నోరు
పంచ అక్షరం పలుకదులే
వంకర కన్నుల మీరు శంకర కింకరులు
వైష్ణవునేం చేస్తారు ఆ యమకింకరులు.....
చరణం 1: నిలువు నామం దాల్చు తలను
మీకు వంచనులే
నిలువునా నను చీల్చుతున్నా
మాట మార్చనులే
వీర శైవుల బెదిరింపులకు
పరమ వైష్ణవం ఆగదులే
ప్రభువు ఆనతికి జడిసేనాడు
పడమట సూర్యుడు పోడవడులే
రాజ్యలక్ష్మి నాథుడు శ్రీనివాసుడే
శ్రీనివాసుడి వారసుడీ విష్ణుదాసుడే
దేశాన్నేలే వారంతా రాజ్య దాసులే
రాజులకు రాజు ఈ రంగారజనే......
చరణం 2: నీటిలోన ముంచినంత నీతి చావదులే
గుండెలోన వెలుగును నింపే జ్యోతి ఆరదులే
[నీటిలోన ముంచినంత నీతి చావదులే
గుండెలోన వెలుగును నింపే జ్యోతి ఆరదులే]
దివ్వేలనార్పే సుడిగాలి
వెన్నెల వెలుగును ఆర్పేనా
నేలను ముంచే జడివాన
ఆకాశాన్నే తడిపేనా
శైవం ఒక్కటి మాత్రం దైవం కాదంట
దైవం కోసం పోరే సమయం లేదంట............
రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు
దేవుని మాత్రం కంటే దేహం కనరాదు....

No comments:
Post a Comment