చిత్రం: ఖలేజా (2010) తారాగణం: మహేష్ బాబు, అనుష్క
సంగీత దర్శకులు: మణిశర్మ సినీ దర్శకులు: త్రివిక్రమ్ శ్రీనివాస్
సంగీత దర్శకులు: మణిశర్మ సినీ దర్శకులు: త్రివిక్రమ్ శ్రీనివాస్
గానం: రమేష్, హేమచంద్ర, కారుణ్య రచన: రామ జోగయ్య శాస్త్రి
ఓం నమో శివ రుద్రాయ
ఓం నమో శితి కంఠాయ
ఓం నమో హర నాగాభరణాయ.....ప్రణవాయ
ఢమ ఢమ ఢమరుక నాదానందాయ
ఓం నమో నిటలాక్షాయ
ఓం నమో హిమశైలావరణాయ......ప్రమథాయ
ధిమి ధిమి తాండవకేళీలోలాయ
సదాశివా సన్యాసి తాపసీ కైలాసవాసీ
నీ పాదముద్రలు మోసి
పొంగి పోయినాది పల్లె కాశి
హే....సూపుల సుక్కని దారిగా
సుక్కల తివాసీ మీదిగా
సూడసక్కని సామి దిగినాడురా
ఏసైరా ఊరూవాడా దండోరా
ఏ రంగుల హంగుల పొడలేదురా
ఈడు జంగమ శంకర శివుడేనురా
నిప్పు గోతున నీలపు మచ్చ సాచ్చిగా
నీ తాపం శాపం తీర్చేవాడేరా
పైపైకలా బైరాగిలా ఉంటాదిరా ఆ లీలా
లోకాలనేలేటొడు నీకు సాయం కాకపోడు
నీలోనే కొలువున్నోడు నిన్నుదాటి పోనేపోడు
ఓం నమః శివ జై జై జై....
ఓం నమః శివ జై జై జై.....
ఓం నమః శివ go to the trance and say జై జై జై.....
Sing along and sing shiva shambo all the way
ఓం నమః శివ go to the trance and say జై జై జై.....
Sing along and sing shiva shambo all the way
ఓం నమః శివ జై జై జై.....
Heal the world is all we pray
save our lives and take our pain away జై జై జై........
Sing along and sing shiva shambo all the way
II సదాశివా సన్యాసి తాపసీ కైలాసవాసీ
నీ పాదముద్రలు మోసి
పొంగి పోయినాది పల్లె కాశి II ఎక్కడ వీడుంటే నిండుగా
అక్కడ నేలంతా పండగ
సుట్టు పక్కల సీకటి పెళ్లగించగా
అడుగేసాడంతా కాచే దొరలాగా
మంచును మంటను ఒక్క తీరుగ
లెక్క సేయ్యనే సేయ్యని శంకరయ్యరా
ఉక్కు కంచెగ ఊపిరి నిలిపాడురా
లెక్క సేయ్యనే సేయ్యని శంకరయ్యరా
ఉక్కు కంచెగ ఊపిరి నిలిపాడురా
మనకండా దండా వీడే నికరంగా
సామి అంటే హామీ తనై ఉంటాడురా చివరంటా
సామి అంటే హామీ తనై ఉంటాడురా చివరంటా
లోకాలనేలేటొడు నీకు సాయం కాకపోడు
నీలోనే కొలువున్నోడు నిన్నుదాటి పోనేపోడు

No comments:
Post a Comment