చిత్రం: జ్యోతి (04-06-1976) తారాగణం: మురళి మోహన్ & జయసుధ
సంగీత దర్శకులు: చక్రవర్తి సినీ దర్శకులు: కే. రాఘవేంద్ర రావు
పల్లవి: సిరిమల్లె పూవల్లె నవ్వు
చిన్నారి పాపల్లె నవ్వు
చిరకాలముండాలి నీ నవ్వు
చిగురిస్తూ ఉండాలి నా నవ్వు
నా నవ్వు......... II సిరిమల్లె II
పనిసా హహ్హహ్హ....సగమ హహ్హహ్హ......
గమప హహ్హహ్హ......
నినిసపమ గమగమప హహ్హహ్హ.....
చరణం 1: చిరుగాలి తరగల్లె మెలమెల్లగా
సెలయేటి నురుగల్లె తెలతెల్లగా II చిరుగాలి II
చిననాటి కలలల్లె తియతియ్య్యగా
ఎన్నెన్నో రాగాలు రవళించగా
రవళించగా............ II సిరిమల్లె II
చరణం 2: నీ పెదవిపై నవ్వులే కెంపుగా ఆ............
నీ కనులలో నవ్వు తెలిమెరుపుగా ఆ............
చెక్కిళ్ళపై నవ్వు నునుసిగ్గుగా (2)
పరువాన్ని ఉడికించి ఉరికించగా
ఉరికించగా................ II సిరిమల్లె II
చరణం 3: నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా
ఆ వెలుగులో నేను పయనించగా II నీ నవ్వు II
ఆ....ఆ......ఆ......ఆ........
వెలుగుతూ ఉంటాను నీ దివ్వెగా (2)
నే మిగిలి ఉంటాను తొలినవ్వుగా
తొలినవ్వుగా......... II సిరిమల్లె II

No comments:
Post a Comment