చిత్రం: అంతులేని కథ (27-02-1976) తారాగణం: జయప్రద, కమల్ హాసన్, రజని కాంత్ & శ్రీ ప్రియ
సంగీత దర్శకులు: ఎమ్.ఎస్. విశ్వనాథన్ సినీ దర్శకులు: కే. బాలచందర్
గానం: ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం రచన: ఆత్రేయ
జుం జుం జుం జుం జుం జుం జుం ....................జుం......
పల్లవి: తాళికట్టు శుభవేళ మేడలో కళ్యాణమాల
ఒహోహో... ఆహాహా.....ఊహుహు.....ఏహేహే..........
తాళికట్టు శుభవేళ మేడలో కళ్యాణమాల
ఏనాడు ఏజంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో.....హాహా...........
ఏనాడు ఏజంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో....ఓఓ.......
తాళికట్టు శుభవేళ మేడలో కళ్యాణమాల
చరణం 1: వికటకవిని నేను వినండి ఒక కథ చెబుతాను
కాకులు దూరని కారడవి, అందులో కాలం ఎరుగని మానొకటి
ఆ అందాల మానులో ఆ అద్భుత వనంలో
చక్కని చిలకలు అక్క చెల్లెలి పక్కన గోరింకలు
ఒక గోరింకకు ఓ చిలకమ్మకు పోద్దిక కుదిరెనమ్మా
(బావా రావా నన్నేలుకోవా)
తాళికట్టు శుభవేళ మేడలో కళ్యాణమాల
ఏనాడు ఏజంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో...
ఏనాడు ఏజంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో...
చరణం 2: మేళాలు తాళాలు మంగళ వాద్యాలు మేన్నంటి మోగెనమ్మా
(తుదుం తుదుం తుం తుం)
మేళాలు తాళాలు మంగళ వాద్యాలు మేన్నంటి మోగెనమ్మా
వలపు విమానాన తలపుల వేగాన్న వచ్చాయి కంకాలమ్మ....
[singapore airlines announces the arrival of flight sq583]
ఊరేగు దారుల వయ్యారి భామలు వీణలు మీటెనమ్మా....
(టివ్ టివ్ టివ్..... టివ్ టివ్........)
సింగారి జానల ముంగాలి మువ్వలు ఘల్లున మోగెనమ్మా....
(ఝి.....ఝి......ఝి....ఝి.....)
తాళికట్టు శుభవేళ మేడలో కళ్యాణమాల
ఒహోహో... ఆహాహా.....ఊహుహు.....ఏహేహే..........
తాళికట్టు శుభవేళ మేడలో కళ్యాణమాల
ఏనాడు ఏజంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో.....హాహా...........
ఏనాడు ఏజంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో....ఓఓ....
చరణం 3: గోమాత లేగతో కొండంత ప్రేమతో దీవించ వచ్చేనమ్మా.....
(అంబా........అంబా..........)
convent పిల్లల పోలిన నెమళులు greetings చెప్పిరమ్మా....
[wish you both th ehappy life....
happy happy married life..... lets enjoy its a boy.....]
నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మా.......
(మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా కంథె బధ్నామి సుభకే త్వం జీవ శరదాం శతం)
నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మా
పట్టపుటేనుగు పచ్చగ నూరేళ్ళు వర్ధిల్ల మనెనమ్మా
(................)
తాళికట్టు శుభవేళ మేడలో కళ్యాణమాల
లలల లలల లలల లలల ..............
చేయి చేయిగ చిలుక గోరింక శయ్యకు తరలిరమ్మా...
చెల్లెలి కోసం త్యాగం చేసిన చిలుకమ్మ తోలిగెనమ్మా.........
తప్పుగ తలచిన అప్పటి గోరింకకు ఇప్పుడు తెలిసెనమ్మా.........
అది చిలుకే కాదని బావిలో కప్పని జాలిగా తలచినమ్మా..........
తాళికట్టు శుభవేళ మేడలో కళ్యాణమాల
ఏనాడు ఏజంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో.......
తాళికట్టు శుభవేళ మేడలో కళ్యాణమాల.......................


No comments:
Post a Comment